మియామీ బీచ్ లో కుప్పకూలిన హెలికాప్టర్!

Telugu Lo Computer
0


అమెరికా లోని మియామీ నగరంలోని సౌత్ బీచ్ లో శనివారం ప్రజలు సేదదీరుతున్న సమయంలో ఆకాశంలో అదుపుతప్పిన ఓ హెలికాప్టర్ ఒక్కసారిగా బీచ్ ఒడ్డు నుంచి పది మీటర్ల దూరంలో సముద్రంలో కుప్పకూలింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో అక్కడ మనుషులెవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ బీచ్ పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతోనే హెలికాప్టర్ కూలినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు. కుప్పకూలిన హెలికాప్టర్ రాబిన్సన్ ఆర్44గా గుర్తించారు. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అధికారులు, జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు విచారణ చేపట్టనున్నారు. హెలికాప్టర్ కుప్పకూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. కొందరు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)