ఓవర్ సీస్ రికార్డ్స్ లో మహేష్ బాబు కు సాటి లేరు!

Telugu Lo Computer
0


టాలీవుడ్ సూపర్ మహేష్ బాబుకి ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ వుంది. గత పదకొండు సంవత్సరాల నుంచి మహేష్ క్రేజ్ ఓవర్ సీస్ లో బాగా పెరిగిపోతుందనే చెప్పాలి. అతడుతో ఓవర్ సీస్ లో రికార్డ్స్ స్టార్ట్ చేసిన మహేష్ దూకుడు సినిమా నుంచి ఆ రికార్డులకు స్పీడ్ పెంచాడనే చెప్పాలి. ఓవర్ సీస్ లో మహేష్ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు అనేవి వస్తుంటాయి. ఆ రికార్డ్స్ లో తెలుగులో మహేష్ తో సమానమైన క్రేజ్ వున్న పవన్ కళ్యాణ్, ప్రభాస్ లు మహేష్ దారిదాపుల్లోకి కూడా రాలేకపోయారనే చెప్పాలి. మహేష్ కి అమెరికాలో 5 లక్షల డాలర్లు పైగా ప్రీమియర్స్ రాబట్టిన సినిమాలు మొత్తం 7 వున్నాయి. ఈ రికార్డ్స్ లో మహేషే టాప్ అని చెప్పాలి. ఇక మహేష్ తరువాత ప్రభాస్, పవన్ కళ్యాణ్ 3 సినిమాలతో మహేష్ తరువాతి స్థానాల్లో వున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది మహేష్ క్రేజ్ ఏంటో. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో 14 రీల్స్ ప్లస్ కూడా బాగస్వామిగా వుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)