యోగా చేస్తున్న మొసలి!

Telugu Lo Computer
0


మన దేశంలో యోగాకు సంబంధించి ప్రత్యేక స్థానం ఉంది.  యోగా గురువులు కూడా చాలా మందే ఉన్నారు. యోగాలో అనేక భంగిమలు ఉంటాయి. యోగా తెలిసిన వారు నీటిలోనూ ఆసనాలు వేస్తుంటారు. జల స్తంభాసనంతో పాటు, నీటిలో తేలియాడుతూ కూడా ఆసనాలు వేస్తుంటారు. అయితే, ముఖ్యంగా యోగా ఐకానిక్‌గా రాందేవ్ బాబా గురించి చెప్పుకోవచ్చు. మనుషుల విషయంలో రాందేవ్ బాబా గురించి చెప్పుకుంటున్నాం.. మరి జంతుజాలంలోనూ యోగా గురువులు ఉన్నాయని మీకు తెలుసా? ఓ ముసలి యోగా చేస్తోంది. నీటిలోనే ఉండి ప్రాణయామం చేస్తోంది. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో.. నీటిలో ఉన్న ఓ మొసలి యోగా చేస్తోంది. జలస్థంభాసనం మాదిరిగా మొసలి ప్రాణయామం చేస్తోంది. నేటిపై తేలియాడుతున్న మొసలి.. పొట్టనిండా గాలి పీల్చి.. వదులతోంది. పలుమార్లు ఇలా చేసిన మొసలి.. ఆ తరువాత నీటిలోకి జారుకుంది. దీనికి సంబంధించిన వీడియోను వైల్డ్ యూనివర్స్ అనే ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో షేర్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ మొసలి యోగాలో బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా అంటూ కామెంట్స్ చేస్తుంటారు. మొసలికి ఆరోగ్యంపై బాగానే శ్రద్ధ ఉందంటూ మరికొందరు అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)