భర్త, మాంత్రికుడు పై భార్య ఫిర్యాదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 February 2022

భర్త, మాంత్రికుడు పై భార్య ఫిర్యాదు


తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఓ వ్యక్తి ఇటివల ఆనారోగ్యానికి గురికావడంతో పాటు ఆర్థికంగా దెబ్బ తిన్నాడు. గత కొద్ది రోజులుగా తన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఓ వైపు మందులు వాడుతున్న రోగం నయం కాకపోవడంతో ఆర్ధిక సమస్యలు కూడా ఆయన్ను అతలాకుతలం చేశాయి.. దీంతో ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే ఓ మాంత్రికుడి గురించి తెలియడంతో వాడిని ఆశ్రయించాడు. దీంతో ఆ మాంత్రికుడు ఆయన ఇంటి అవసరాలను ఆసరా చేసుకున్నాడు. ఇంటికి అరిష్టం పట్టిందని చెప్పాడు. అప్పటికే మానసిక ఆలోచనలో పడ్డ ఆయన్ను తనవైపుకు తిప్పుకున్నాడు. ఇంట్లో నలబై అయిదు రోజుల పాటు క్షుద్రపూజలు చేయాలని చెప్పాడు. మరోవైపు బాధితుడి భార్య సైతం తాను చెప్పినట్టుగా చేయాలని ఏది తాగమంటే అది తాగాలని తనతో శారీరకంగా గడపాలని చెప్పాడు. వీటన్నింటికి ఒప్పుకున్న భర్త ఆ క్షుద్రపూజలు చేసే శ్రీనివాస్‌ను ఐదు రోజుల క్రితం పిలిపించాడు. ఇంట్లో పూజలు మొదలయ్యాయి. అయితే భార్యను మాంత్రికుడితో శరీరకంగా గడిపే విషయం చెప్పకుండా దాచిన భర్తతో ఆమె విభేదించింది. పూజారి చెప్పినట్టుగా తాను శారీరకంగా కలవలేనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె ఇంట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి తిరిగి మధిరకు చేరుకుంది. తన భర్తతో పాటు ఆ మాంత్రికుడు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న భర్తతో పాటు క్షుద్రపూజల మాంత్రికుడు పరారయ్యారు. 

No comments:

Post a Comment