తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం కొత్త యాప్!

Telugu Lo Computer
0


ఇండియ్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం కొత్తగా కన్ఫామ్ టికెట్ పేరుతో యాప్ లాంఛ్ చేసింది. ఈ యాప్ కేవలం తత్కాల్ ట్రైన్ టికెట్ల బుకింగ్  కోసం మాత్రమే. తత్కాల్ టికెట్లను రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు మాత్రమే బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైల్వే ప్రయాణికులు కన్ఫామ్ టికెట్ యాప్ ద్వారా తత్కాల్ రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. ఇందులో కేవలం ఏ ఏ రైళ్లల్లో తత్కాల్ రైలు టికెట్లు అందుబాటులో ఉన్నాయో తెలుస్తుంది. దీంతో పాటు ఏ రూట్‌లో తత్కాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ప్రయాణికులు వ్యక్తిగత వివరాలను యాప్ లేదా వెబ్‌సైట్‌లో ముందుగానే వివరాలు అప్‌డేట్ చేయాలి. దీని వల్ల తత్కాల్ టికెట్స్ బుక్ చేసేప్పుడు సమయం ఆదా అవుతుంది. వారికి తత్కాల్ టికెట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐఆర్‌సీటీసీ లాగిన్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఇ-టికెట్ ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో వస్తాయి. అత్యవసరంగా ప్రయాణాలు చేయాలనుకునేవారు, చివరి నిమిషంలో ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నవారికి తత్కాల్ రైలు టికెట్స్ ఉపయోగపడతాయి. తత్కాల్ టికెట్లు రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏసీ రైళ్లల్లో తత్కాల్ టికెట్ల బుకింగ్ ముందు రోజు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ రైళ్లల్లో తత్కాల్ టికెట్లకు ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది. తత్కాల్ టికెట్లు బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, జన్ శతాబ్ధి, ఇంటర్‌సిటీ, సూపర్ ఫాస్ట్ రైళ్లు, డబుల్ డెక్కర్ రైళ్లు, సంపర్క్ క్రాంతి, మెయిల్ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు అన్ని రైళ్లల్లో తత్కాల్ టికెట్స్ బుక్ చేయొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)