రెండో భార్యకు పెన్షన్‌ ఇవ్వడం కుదరదు

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ప్రభుత్వం తనకు పెన్షన్‌ ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ సోలాపూర్‌కు చెందిన శామల్‌ తాటే దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మృతుని మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కాని పరిస్థితుల్లో రెండో భార్యకు అతని పెన్షన్‌ ఇవ్వడం కుదరదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.1996లో మరణించిన ఆమె భర్త మహాదేవ్‌ తాటే సోలాపూర్‌ కలెక్టరేట్‌లో ప్యూన్‌గా పనిచేసేవాడు. శామల్‌ అతడికి రెండో భార్య. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌లో 90 శాతం మొదటి భార్య తీసుకొని నెలవారీ పింఛన్‌ రెండోభార్యకు ఇచ్చేలా వారి మధ్య అంతర్గత ఒప్పందం కుదిరింది. మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోయిన తర్వాత రెండోభార్య అయిన శామల్‌ తనకు నెలవారీ పెన్షన్‌ చెల్లించాలని 2007 నుంచి 2014 మధ్యకాలంలో నాలుగుసార్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నది. వాటిని ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం సరైనదేనంటూ శామల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)