ఆ నీరు శరీరంలోని వ్యర్ధాలను పోగొడుతుందా?

Telugu Lo Computer
0


మారుతున్న జీవనశైలిలో ప్రతిరోజు మనం తీసుకుంటున్న ఆహారం కలుషితంగా మారుతుంది. దీని వల్ల శరీరంలో విషపదార్ధాలు పేరుకుపోతున్నాయి. వీటి వల్ల మనిషి అనేక రుగ్మతలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిసత్తువ, అలసట, తలనొప్పి, చర్మ సంబంధిత సమస్యలు ఎదురువతుతాయి. ఇలాంటి రుగ్మతలను నుండి బయటపడటంతోపాటు శరీరంలోని విషాలను బయటకు పంపేందుకు డీటాక్స్ వాటర్ విధానాన్ని అనుసరిస్తూ మంచి ఫలితాన్ని పొందుతున్నారు. శరీరంలో ఉన్న మలినాల్ని తొలగించటం ఈ డీటాక్స్ వాటర్ ప్రధానమైన విధి. ఒక రకంగా చెప్పలంటా ఇది సహజసిద్ధంగా మన శరీరంలోని మలినాలను తొలగించుకునే ప్రక్రియ. డీటాక్స్ వాటర్ రోజు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. డీటాక్స్ వాటర్ సేవించటం వల్ల ఈ నీటి ప్రభావం కాలేయంతోపాటు ఊపిరితిత్తులపై పనిచేస్తుంది. శరీరంలో దాగివున్న విషమలినాలను బయటకు పంపటంద్వారా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఒక బాటిల్ లో రెండు లీటర్ల నీరు పోయాలి. అందులో కీరదోస ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, ఒక అల్లం ముక్క, 10 పొదీనా ఆకులు వేసుకోవాలి. వాటిని రాత్రి నుండి ఉదయం వరకు అలాగే ఉంచాలి. ఉదయాన్నే బాటిల్ లో వేసిన వాటిని తొలగించాలి. పరగడుపునే ఈ నీటిని కొద్ది మొత్తాల్లో సేవిస్తూ రాత్రి పడుకోబోయే ముందు వరకు ఇలా రోజుమొత్తంలో తాగేయాలి. డీటాక్స్ వాటర్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డీటాక్స్ వాటర్ లో నిమ్మకాయ, కీరదోస ఈరెండు పోషకాలు నింపుకుని ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గించే లక్షణాలు కలివుంటాయి. ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకోవటం వల్ల శరీరం శుభ్రపడుతుంది. దోసకాయలో ఉండే ఎంజైమ్ లు జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్థాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. అంతే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో డీటాక్స్ వాటర్ తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. శరీరానికి చల్లదాన్ని ఇస్తుంది. దాహం అతిగా వేయకుండా చూస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. డీటాక్స్ వాటర్ వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. తద్వారా వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చు. డీటాక్స్ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు, నీరు పేరుకుపోవడం వంటి రుగ్మతలన్నీ తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. చర్మంపై మురికి, టాక్సిన్లు, మలినాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్ హెడ్స్, ఏర్పడతాయి. అలాంటి వారు ఈ డీటాక్సీ వాటర్ తాగటం వల్ల మొటిమలు, మచ్చలను తగ్గించుకోవచ్చు. డీటాక్స్ వాటర్ అన్నది సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిందే కాబట్టి.. దాదాపు అందరూ దీన్ని తీసుకోవచ్చు. పండ్లు, కూరగాయల్లోని విటమిన్లు, మినరల్స్ శరీరానికి శక్తినిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)