బస్సు డ్రైవర్‌ని కాలితో తన్నిన మహిళ !

Telugu Lo Computer
0


విజయవాడలోని 5వ నెంబర్ బస్ రూట్‌లో ఆంధ్రా హాస్పిటల్ వన్ వేలో డ్రైవర్ మొండితోక ముసలయ్య బస్సును నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్‌లో ఓ మహిళ రావడంతో ఆయన సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆమె డ్రైవర్‌పై రెచ్చిపోయింది. రాంగ్ రూట్‌లో వచ్చినంత మాత్రాన ఢీకొట్టి చంపేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. బూతులు తిడుతూ.. బస్సులోకి ఎక్కి మరీ డ్రైవర్‌ను కాళ్లతో తన్నింది. తప్పు ఎవరిదో తెలిసిన బస్సులోని ప్రయాణికులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫుల్ ఫైర్ మీదున్న మహిళ.. ప్రయాణికులపైనా చిందులేసింది. ఇంజన్ బానిట్ ఎక్కి కాళ్లతో తన్నుతూ బండ బూతులు తట్టింది ఆ మహిళ. దాంతో పలువురు ఆమె వీరంగాన్ని ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా.. వారిని కూడా బెదిరించింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్‌పై దాడి చేయడాన్ని ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు తీవ్రంగా ఖండించారు. కాగా, మహిళ దాడిపై ఆర్టీసీ డ్రైవర్ సూర్యారవు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వీరంగాన్ని లేడీ కండక్టర్ వీడియో తీశారు. దీంతో కండక్టర్‌ను సైతం ఆమె దుర్భాషలాడారు. ముందు బస్ దిగు అంటూ డ్రైవర్‌ లాగే ప్రయత్నం చేసింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)