వివాహం చేసుకున్న నవీన్ చంద్ర

Telugu Lo Computer
0


తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఇన్నాళ్లు బ్యాచిలర్ అనుకొని అందరూ పొరపాటు పడ్డారు.. కానీ తాను కూడా మ్యారీడ్ అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నవీన్ చంద్ర వెబ్ సిరీస్ లో చేస్తున్నాడు. తాజాగా పరంపర అనే వెబ్ సిరీస్ తో అలరించిన నవీన్ చంద్ర ప్రస్తుతం అరవింద్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు.. నవీన్ చంద్ర కు సంబంధించిన పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ అందరికీ షాక్ ఇచ్చింది. నవీన్ చంద్ర ఎక్కడా కూడా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించలేదు. స్మార్ట్ గా కనిపించే నవీన్ చంద్ర కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అందరూ నవీన్ చంద్ర ను బ్యాచ్ లర్ అనే అనుకున్నారు. నవీన్ చంద్ర తాజాగా ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. నన్ను బ్యాచిలర్ అనుకున్నారు కానీ నేను బ్యాచిలర్ కాదు అని షాక్ ఇచ్చాడు.. అంతేకాదు తనకు పెళ్ళయిందని కూడా ప్రకటించాడు.. వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికీ షాకిచ్చాడు.  నీ ప్రేమ ఎప్పుడూ గుండెల్లోనే ఉంటుంది.. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ.. నా బెటర్ హాఫ్ ఓర్మా అంటూ తన భార్య పేరుతో సహా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేశాడు నవీన్ చంద్ర.. ప్రస్తుతం ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారింది.  ఆయన అభిమానులు ట్విట్టర్ ద్వారా నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)