దేశంలో 1,61,386 కరోనా కేసులు!

Telugu Lo Computer
0


దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య అదుపులోకి వస్తోంది. రోజూవారీ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చాయి. ఇటీవల కాలంలో రోజూవారీ కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా కేసులు సంఖ్య తగ్గినా మరణాల సంఖ్య పెరగడం కలవరపరుస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 1,61,386 తాజా కోవిడ్ కేసులు నమోదవ్వగా… 2,81,109 రికవరీలు నమోదయ్యాయి.యాక్టివ్ కేసులు సంఖ్య 16,21,603గా ఉంది. 3,95,11,307 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. రోజూవారీ పాజిటివిటీ రేటు 9.26 గా ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 1,733 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 4,97,975 కు చేరుకుంది. దేశంలో మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశంలో అర్హులైన 75 శాతం మందికి రెండు డోసులు కరోనా ఇచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 167.29 కోట్ల డోసులను ఇచ్చారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. మూసుకున్న బడులను మళ్లీ తెరుస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)