ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 8 January 2022

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం


కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ట్రక్కు - కారు ఢీ కొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం నలుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే ప్రమాదానికి కారణమయ్యాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వగా, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్ కుల్దీప్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కు ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమయింది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ ముందున్న మరో లారీని ఢీ కొట్టింది. పూర్వాంకర అపార్ట్ మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంకు తరలించారు. 

No comments:

Post a Comment