కోతులు వెతికేది పేల కోసమేనా ?

Telugu Lo Computer
0


కోతులు పేలు ఎందుకు చూసుకుంటాయి…? చూసుకున్న పేలు ఎందుకు తింటాయి…? ఈ విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. కోతులు అలా చేయడం చూస్తే మాత్రం మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సృష్టిలో రెండు ప్రాణులు మాత్రమే తమ తలపై చేతులు పెట్టుకుంటాయి. ఒకటి మనిషి రెండు కోతి. మనుషులకు మరియు కోతులకు మాత్రమే రెండు కాళ్ళు, రెండు చేతులు ఈ సృష్టిలో ఉంటాయి. చేతులకు, వంగే మణికట్టు, మనికట్ల తర్వాత మూడు కీళ్లతో కూడిన (బొటవెళ్లకు 2 కీళ్ళు) వేళ్ళు, ఉండేది ఈ ఇద్దరికే. కాబట్టి వారి చేయి తల వరకు వెళ్తుంది. పేలు దొరికిన వెంటనే నోట్లో వేసుకుని చప్పరిస్తాయి కదా… పెంపుడు కోతులు కూడా ఇదే విధంగా చేస్తూ వాటిని పెంచుకునేవారి తలల్లో పేలు లేకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదొకటి వెతుకుతూ ఉంటాయి. వాస్తవానికి అసలు అవి వెతికేది పేలు కాదని, తలపై ఎండిపోయిన చర్మపు పొలుసు, చర్మలోనుంచి ఊరి వచ్చే ఉప్పు పలుకుల కోసం అవి వెతుకుతుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.  అలా వేరుకుని తినడంతో తృప్తి కలిగించే ఫీలింగ్ ఉంటుందని, అలా వేరుకునే క్రమంలో పేలు, పురుగులు కూడా వాటికి తగులుతూ ఉంటాయని అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)