పీఆర్సీకి మంత్రివర్గం ఆమోదముద్ర !

Telugu Lo Computer
0


సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు, ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు, ఈబీసీ నేస్తం అమలుకు, వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం, ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం.  దీంతో పాటు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)