'సైరా' ఎప్పుడు రిలీజైందో మంత్రికి తెలియదా?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్ల విషయంలో ఉన్న సమస్యలపై హైకోర్టు సూచన మేరకు ఓ కమిటీ వేశామని.. ఆ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినిమా థియేటర్లపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదని, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు సంబంధించిన ఓ వ్యక్తి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విషయంలో కూడా ఇదే టిక్కెట్ రేట్లను ఉంచుతారా అంటూ మంత్రి పేర్ని నానిని ప్రశ్నించగా దీనికి స్పందించిన మంత్రి తమ ప్రభుత్వం బామ్మర్ది విషయంలో ఒకలా, మరొకరి విషయంలో ఇంకోలా ప్రవర్తించదంటూ టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గతంలో బామ్మర్ది బాలకృష్ణ తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు చంద్రబాబు రాయితీ ఇచ్చారని, అదే చిరంజీవి తీసిన సైరా సినిమాకు రాయితీ ఇవ్వలేదని పేర్ని నాని ఆరోపించారు. కానీ సీఎం జగన్‌ అందరినీ ఒకేలా చూస్తారని పేర్ని నాని అన్నారు. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా 2019లో అక్టోబర్ నెలలో విడుదలైంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ ప్రభుత్వమే ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జగన్ ప్రభుత్వాన్ని కలిసి పన్ను రాయితీ ఇవ్వాలని కూడా అడిగారు. అయితే ప్రభుత్వం చిరంజీవి వినతిని బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు జగన్ సర్కారు ఈ నెపాన్ని టీడీపీ ప్రభుత్వం వేసి రుద్దాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సైరా సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా తెలియని పేర్ని నాని సినిమాటోగ్రఫీ మంత్రి ఎలా అయ్యారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)