రైతులకు రూ.20 వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం శనివారం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు దాదాపు రూ.20,000 కోట్లు విడుదల చేసింది.10 కోట్ల రైతు కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారుల్లో ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు రూ.2,000 చొప్పున నేరుగా జమ అవుతాయి. ఈ ఆర్థిక సాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ పథకం క్రింద 10వ విడత చెల్లించిన ఆర్థిక సాయం. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులను సాధికారులను చేయాలనే పట్టుదల, అంకితభావం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్నాయని, దీనిలో భాగంగానే ఈ నగదును రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అంతకుముందు తెలిపింది. 351 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓ)లకు ఈక్విటీ గ్రాంట్‌గా సుమారు రూ.14 కోట్లు విడుదల చేశారు. దీనివల్ల 1.24 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి రూ.6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఈ సొమ్మును మూడు విడతల్లో నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున ఇస్తోంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు ఈ సొమ్మును జమ చేస్తోంది. ఇప్పటి వరకు రూ.1.6 లక్షల కోట్లు అందజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)