మూడో టెస్ట్‌ కు వృద్ధిమాన్ సాహా ?

Telugu Lo Computer
0


జొహాన్స్‌బర్గ్‌ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ప్రొటిస్‌ 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టెస్ట్‌ ఇరు జట్లుకు కీలకం కానుంది. భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్‌ జనవరి 11 నుంచి కేప్ టౌన్ వేదికగా జరుగనున్నది. అయితే గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన విరాట్‌ కోహ్లి.. అఖరి టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ కోహ్లి తుది జట్టులోకి వస్తే హనుమా విహారి మరోసారి బెంచ్‌కు పరిమితం అవ్వక తప్పదు. రెండో టెస్ట్‌లో కోహ్లి స్దానంలో విహారికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే... జొహాన్స్‌బర్గ్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ వికెట్‌ పారేసుకున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మూడో టెస్టులో అతడిని తప్పించి వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కు అవకాశం ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. దీంతో కేప్ టౌన్ టెస్ట్‌కు పంత్‌ను తప్పించే ఆలోచనలో కోహ్లి, కోచ్‌ ద్రవిడ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్నాళ్లగా రిషబ్‌ పంత్‌ అంత ఫామ్‌లో లేడు. ప్రస్తుత సిరీస్‌లో పంత్‌ నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 59 పరగులు మాత్రమే చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)