రియల్‌మీ 8ఎస్‌కు లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 3 January 2022

రియల్‌మీ 8ఎస్‌కు లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ !

స్వదేశీ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా మొబైల్స్‌ అనూహ్యమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఉచితంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుదారులు పొందే అవకాశాన్ని లావా మొబైల్స్ కల్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారుల కోసం లావా ఆసక్తికరమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌ కింద న్యూ లావా అగ్ని5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు రియల్‌మీ 8ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ జనవరి 7 వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చును. ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా రిజిస్ట్రేషన్‌ వ్యవధిలో కొనుగోలుదారులు తమ పేరు, చిరునామా ఇతర ప్రాథమిక వివరాలను వెబ్‌సైట్‌లో నమోదుచేయాల్సి ఉంటుంది. లావా కంపెనీకి చెందిన 'అగ్ని మిత్ర (ఎగ్జిక్యూటివ్‌)' ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా రియల్‌మీ 8ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ధృవీకరించిన తరువాత కొత్త లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తారు. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ. 20 వేలుగా ఉంది. 2021లో లావా మొబైల్స్‌ లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 6.78-అంగుళాల పూర్తి హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్‌, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5000 mAh బ్యాటరీ, 8జీబీ ర్యామ్‌+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్


No comments:

Post a Comment