సంక్రాంతికి 12 సినిమాలు విడుదల ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 4 January 2022

సంక్రాంతికి 12 సినిమాలు విడుదల ?


సంక్రాంతికి ఎలాంటి సినిమాలు వస్తాయని ప్రేక్షకులు కలలు కన్నారో వాటికి పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. వెయ్యి కోట్ల మార్కెట్ జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు వంద కోట్లు జరిగితే అదే గొప్ప విషయంలా కనిపిస్తుంది. అనుకోకుండా ట్రిపుల్ ఆర్ రేసు నుంచి తప్పుకోవడంతో నిర్మాతలకు కూడా ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తుందని ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. ప్రభాస్ రాధే శ్యామ్ సైతం వచ్చే వరకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే. ట్రిపుల్ ఆర్ సినిమాకు వర్కవుట్ కానివేవీ దీనికి కూడా కావు. అయినా కూడా రాధే శ్యామ్ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రభాస్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారిక సమాచారం అయితే రాలేదు. దాంతో ఈ పండక్కి భారీ బడ్జెట్ సినిమా ఇదే కానుంది. రాధే శ్యామ్: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం కావడంతో.. ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకుని మరీ విడుదల చేయడానికి నిర్ణయించారు దర్శక నిర్మాతలు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సినిమాను దాదాపు 150 కోట్లతో నిర్మించారు. హిందీ, తమిళంలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నా కూడా జనవరి 14నే సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు నిర్మాతలు. బంగార్రాజు: నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. నాగ చైతన్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది ఈ చిత్రం. రౌడీ బాయ్స్: దిల్ రాజు నిర్మాణంలో ఆయన వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా రౌడీ బాయ్స్. శ్రీహర్ష ఈ సినిమా దర్శకుడు. ఇది కూడా సంక్రాంతికే విడుదల కానున్నట్లు అనౌన్స్ చేసాడు దిల్ రాజు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరో: మహేష్ బాబు మేనల్లుడు, తెలుగుదేశం నాయకుడు గల్ల జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా హీరో. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానున్నట్లు పోస్టర్ విడుదల చేసారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు.7 డేస్ 6 నైట్స్: సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా 7 డేస్ 6 నైట్స్. ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నాడు. ఇది కూడా పొంగల్‌కే రానుంది. సూపర్ మచ్చి: కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సూపర్ మచ్చి. చిరంజీవి చిన్నల్లుడు నటిస్తున్న రెండో సినిమా ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం. డిజే టిల్లు: కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వస్తున్న సినిమా డిజే టిల్లు. జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా వస్తుంది. అతిధి దేవోభవ: ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న అతిథి దేవోభవ సినిమా సైతం సంక్రాంతి విడుదలకే సిద్ధమైంది. సామాన్యుడు: విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దాంతో ఈయన కూడా పండక్కే వస్తున్నాడు. ఈయన హీరోగా శరవణన్ తెరకెక్కించాడు. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. వలిమై: అజిత్ హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా వలిమై. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 13న విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీలోనూ అదే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. వేయి శుభములు కలుగునీకు అనే చిన్న సినిమా కూడా ఈ సంక్రాంతికే వచ్చేస్తుంది. జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. 1945: రానా దగ్గుబాటి హీరోగా ఎప్పుడో రెండేళ్ల కింద షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా 1945. సత్యశివ తెరకెక్కించిన ఈ చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకుని విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాత జనవరి 7న 1945 సినిమాను సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేస్తున్నాడు.

No comments:

Post a Comment