రైలు బోగీ వెనుక " x " సింబల్ ని ఎందుకు ?

Telugu Lo Computer
0


మనం చాలా సార్లు రైలు ప్రయాణం చేసి ఉంటాం. అయితే రైలుని గమనించినప్పుడు దాని మీద ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయి. ఎక్స్ అనే గుర్తు మనకి ఎక్కువగా కనబడుతుంటుంది. భోగి వెనక పెద్దగా ఎక్స్ అని వేస్తారు. దానికి కొంచెం దగ్గరలో ఎల్వి అనే అక్షరాలను కూడా రాస్తారు అయితే ఎప్పుడైనా ఇలా ఎందుకు రాస్తారు అనే సందేహం కలిగిందా..? ఎల్వి అంటే లాస్ట్ వెహికిల్ అని అర్థం. భోగి వెనక భాగంలో చిన్న ఎల్లో కలర్ బోర్డు కూడా ఉంటుంది. ఇది రెండువైపులా ఉంటుంది. ఎక్స్ సింబల్ కింద భాగంలో ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. రైళ్ళకి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడేందుకు ఈ సింబల్ ని వేస్తారు. అయితే రాత్రిపూట భోగి వెనకాల ఉండే ఎక్స్ సింబల్ కింద ఉండే రెడ్ లైట్ ని బట్టి అలెర్ట్ అవుతారు. ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండడానికి ఈ సింబల్స్ ని వేస్తూ ఉంటారు అందుకే రైలుకి వెనకాల x సింబల్ ని వేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)