యువకుడిని చంపి, కొయ్యకు వేలాడదీత ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 December 2021

యువకుడిని చంపి, కొయ్యకు వేలాడదీత !


తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం గొర్రెకల్‌కు చెందిన ముల్కగోని అశోక్ (28)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి, మృతదేహాన్ని పోతులబోగుడ గ్రామానికి చెందిన నిమ్మగారి విఠల్ ఇంటి గోడకు వేలాడేశారు. బుధవారం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జోగిపేట సీఐ శ్రీనివాస్‌, వట్‌పల్లి ఎస్ఐ దశరత్ లు పరిసరాలను పరిశీలించారు. యువకుడి మెడకు టవాల్ చుట్టేసి, విఠల్ ఇంటి బయట గోడకు ఉన్న కొయ్యకు మృతదేహాన్ని వేలాడేసి ఉండడంతో గుర్తు తెలియని వారు హత్య చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతుంది. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబీకులు, బంధువులు పోతులబోగుడకు చేరుకుని డాగ్ స్కౌడ్‌ను రప్పించాలని, క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టాలని పోలీసుల ముందు పట్టుబట్టారు. దీంతో డాగ్ స్కౌడ్‌, క్లూస్ టీం బృందాలను రప్పించి దర్యాప్తు చేయించారు. జాగిలాలు తిరిగిన ప్రాంతాలను పరిశీలించి, క్లూస్ టీం బృందం సభ్యులు ఫింగర్ ప్రింట్‌లను సేకరించి, వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. గొర్రెకల్ నుంచి పోతులబోగుడకు అశోక్ ఎందుకు వేళ్లాడు? నిమ్మగారి విఠల్ ఇంటి ముందు అశోక్ మృతదేహాన్ని ఎందుకు, ఎవరూ వేలాడదీశారు.  వీరిద్దరికి ఏమైనా సంబంధాలున్నాయా?  గొర్రెకల్‌కు చెందిన ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉందని, అమె పుట్టిళ్లు పోతులబోగుడ గ్రామం కావడంతోనే అశోక్ మంగళవారం రాత్రి వెళ్లాడని, అమెకు సంబంధించిన వారే హత్య చేసి ఉంటారన్న అనుమానాలను మృతుని కుటుంబీకులు వారి సన్నిహితుల ముందు అవేదనను వ్యక్తం చేస్తున్నారు. హత్య ఎవరూ చేశారు.. ఎందుకు చేశారో…పోలీసుల విచారణలో తేల్చాల్సి ఉంది.


No comments:

Post a Comment