క్షీణించనున్న ఒమిక్రాన్‌!

Telugu Lo Computer
0


భారత్‌లో రోజువారీ ఒమిక్రాన్‌ కేసులు ఒక్కపెట్టున పెరిగి, కొద్దిరోజుల తరవాత బాగా తగ్గిపోతాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ఆచార్యుడు పాల్‌ కాటుమన్‌ అంచనా వేశారు. విశ్వవిద్యాలయం తరఫున కొవిడ్‌ ఇండియా ట్రాకర్‌ను రూపొందించిన పరిశోధకుల్లో ఆయన ఒకరు. మరికొద్ది రోజుల్లో.. బహుశా ఈ వారంలోనే భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరిగిపోవచ్చునని పాల్‌ పేర్కొన్నారు. పెరుగుదల ఎంతమేరకు ఉంటుందన్నది మాత్రం ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. భారత్‌లో రెండో దశ కొవిడ్‌ మే నెలలో విరుచుకుపడుతుందని కొవిడ్‌ ఇండియా ట్రాకర్‌ గతంలో కచ్చితత్వంతో అంచనా వేసిన సంగతి గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)