శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఊరుకోబోము !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన జిన్నా టవర్‌పై హోంమంత్రి సుచరిత స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదని, ఏ ఉద్దేశంతోనైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదని తెలిపారు. శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పన్నారు. జిన్నా టవర్ వలన జిన్నా ఏం నష్టం చేశాడు, ఏం మేలు చేశాడు అనేది ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. ఎవరు అధికారంలో ఉన్నా ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్దతి కాదని తెలిపారు. అబ్దుల్ కలాం పేరుతో కొత్త నిర్మాణాలు చేయండి ఉన్నవి తొలగించవద్దని చెప్పారు. ఇంకా ఇతర నేతలు చాలామంది ఉన్నారని, వారి మీద ప్రేమ ఉంటే వారి నిర్మాణాలు చేయాలంటూ హోంమత్రి సుచరిత హితవుపలికారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)