అమెరికాలో కొవిడ్ కల్లోలం !

Telugu Lo Computer
0


అగ్రరాజ్యం అమెరికాలో ఏడాది కిందటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం అయ్యాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోపాటు ప్రమాదకారి డెల్టా, ఇతర వేరియంట్లు తిరగబెట్టడంతో రోజువారీ కేసులు అమాంతం ఆకాశాన్నంటాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. నిపుణుల అంచనా ప్రకారం అతి త్వరలోనే రోజువారీ కేసుల సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకనుంది. క్రిస్మస్ తర్వాత రిటర్న్ ప్రయాణాలు పెరగడంతో అమెరికాలో కొవిడ్-19 కేసులు కూడా పీక్స్ కు చేరాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అధికారికంగా వెల్లడించిన డేటా ప్రకారం, యుఎస్ లో ఇప్పుడు ప్రతిరోజూ సగటున 1,98,404 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదవుతున్నాయి. గత వారం కంటే ఏకంగా 47% ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైనవాటి కంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం అమెరికాలో ప్రతిరోజూ సగటున 1,408 కొవిడ్ మరణాలు నమోదవుతున్నాయి. గతవారంతో పోలిస్తే ఇది 17% పెరుగుదల. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం ఈ వారం ప్రారంభం నాటికి సుమారు 71,000 మంది అమెరికన్లు కోవిడ్-19తో ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికే 2లక్షలకు చేరువైన రోజువారీ కేసులు అతి త్వరలోనే 5లక్షలకు చేరనుందని వైరాలజీ నిపుణుడు డాక్టర్ జోనాథన్ రీనర్ చెప్పారు. వ్యాప్తిలో అత్యంత వేగం కలిగిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల అమెరికాలో కచ్చితంగా కొంతకాలం పాటు కేసుల పెరుగదల చూడబోతున్నామని డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారీ ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు వద్దని, ఎవరికివారే ఇళ్లలోనో, కమ్యూనిటీల్లోనో చిన్న సైజు పార్టీలకే పరిమితం అయితే మంచిదని ఫౌచీ సూచించారు. అమెరికాలో ప్రస్తుతం పెరిగిన కొవిడ్ కేసుల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారం రోజువారీ కేసుల్లో సగటున 262 మంది పిల్లలు కోవిడ్-19తో ఆసుపత్రి పాలవుతున్నట్లు వెల్లడైంది. సిడిసి డేటా ప్రకారం, ఆగస్టు 2020 నుంచి సుమారు 75,000 మంది పిల్లలు (1 నుంచి 17 సంవత్సరాల వారు) కోవిడ్-19 తో ఆసుపత్రిలో చేరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)