పెంపుడు కుక్కను నమోదు చేసుకోండి!

Telugu Lo Computer
0


మీ పెంపుడు కుక్కను నమోదు చెయ్యాలి. లేదంటే జరిమానాని కట్టాల్సి వస్తుంది. కనుక వెంటనే జీహెచ్ఎంసీలో నమోదు చేసుకోండి. ఒకవేళ నమోదు చెయ్యకుండా బయటికి తీసుకెళితే రూ.1000 నుంచి రూ.50,000 దాకా జరిమానా పడుతుంది. ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు మీ ఇళ్ళకి వచ్చి చూసినప్పుడు నమోదు చేయలేదని తెలిస్తే ఫైన్ కట్టాలి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం దాదాపు 50 వేల పెంపుడు కుక్కలున్నాయి. అందులో కేవలం 500 వరకూ మాత్రమే నమోదయ్యాయి. అందుకే ఇంత కఠినమైన రూల్స్ ని తీసుకు వచ్చింది. అలానే నిబంధనల ప్రకారం, ప్రతి కుక్కకు రేబిస్ టీకా వేయించాలి. అయితే కొంత మంది కుక్కను పెంచుకున్నంత కాలం పెంచుకుని, పొరపాటున ఏదైనా రోగం కానీ సమస్య కానీ వస్తే వదిలేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. రిజిస్టర్ చేసుకోవాలి అంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు తాజాగా కుక్కకు వేయించిన వ్యాక్సీనేషన్ సర్టిఫికెట్ అందజేయాలి. నివాస ధృవీకరణ పత్రం, మీ ఇంటి పక్కవారి నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక ప్రత్యేక నెంబరును కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ లైసెన్సును ఇస్తారు.


Post a Comment

0Comments

Post a Comment (0)