పొగడ పండ్లు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


సపోటేసి కుటుంబానికి చెందిన పొగడ చెట్టులో ఉన్న ప్రయోజనాలు మనలో రోడ్డు పక్కన ఈ చెట్లను చూస్తూనే ఉంటాం. కానీ వాటి ప్రయోజనాలు తెలియక పెద్దగా పట్టించుకోం. ఈ చెట్టు కాయలు అండాకారంలో ఉండి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను పండితే కాషాయం రంగులోనూ ఉంటాయి ఈ పండులో ఒక గింజ లేదా రెండు గింజలు ఉంటాయి. ఈ పండ్ల పై ఉన్న గుజ్జు తియ్యగా ఉంటుంది. కానీ దానిలో ఉండే సాఫోనిన్ అనే రసాయన పదార్థం కారణంగా వీటిని తింటూ ఉంటే కొంచెం వగరుగా అనిపిస్తుంది. పువ్వులు, పళ్ల నుంచి తయారు చేసే లోషన్ ను గాయాలు త్వరగా నయం కావటానికి ఉపయోగిస్తారు. ఈ పువ్వులను వాసన చూస్తే తల నొప్పి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ పండ్లను తింటే చిగుళ్లు వ్యాధులు తగ్గుతాయి. పళ్ళు గట్టిగా ఉంటాయి. ఈ పువ్వులను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకుని నిల్వచేసుకోవాలి ఈ పొడిని చిటికెడు తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగుతూ ఉంటే జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ విధంగా తాగడంవలన తలనొప్పి తగ్గడమే కాకుండా మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. అంతే. కాకుండా ఈ చెట్టు బెరడును పేస్ట్ గా చేసి నుదురు మీద రాస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. దంతాలు నుండి రక్తస్రావం అవుతూ ఉంటే ఈ చెట్టు పచ్చి కాయలను నమలాలి. లేదా ఆకులను నమిలితే సమస్య తగ్గిపోతుంది. పొగడ పండ్ల గింజలను దంచి, నేతితో కలిపి మెత్తటి పేస్టుగా చేసి, పిల్లలకి తినిపిస్తే మలబద్ధకం తగ్గి సాఫీగా విరేచనాలు అవుతాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)