ఉల్లిపాయ - ఊబకాయం

Telugu Lo Computer
0


అధిక బరువు వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేదిస్తోంది. కాస్త బరువు పెరిగితే చాలు కడుపు మార్చుకోవడం లేదంటే ఎక్సర్సైజులు చేయడం మొదలు పెడతారు. ఈ రెండు చేయకుండానే సులువుగా బరువు తగ్గొచ్చు. ఒక ఉల్లిపాయ ను తీసుకొని సన్నగా ముక్కలు తరగి మిక్సీ పట్టి గుజ్జుగా చేసుకొని దీనిలో కొద్దిగా తేనె కలుపుకుని నేరుగా తాగొచ్చు. లేదంటే రసం చేసుకొని తాగండి. ఉల్లిపాయ రసంను ఉదయం పరగడుపున మాత్రమే తాగాలి. అది కూడా ప్రతిరోజు తాగకూడదు. రెండు రోజులకు ఒకసారి లేదంటే వారంలో మూడు సార్లు మాత్రమే తాగాలి. ఇలా తయారు చేసుకుని ఉల్లి రసం తాగితే ఎటువంటి పొట్ట అయినా సులువుగా కరిగిస్తుంది. ఉల్లి పాయలు లో క్వేర్ సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంది. ఇది శరీరం మెటబాలిజంను పెంచుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న వయసులో పొట్ట వద్ద పేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు ఉల్లి అద్భుతంగా సహాయపడుతుంది. అందుకని పైన చెప్పుకున్న విధంగా ఉల్లి రసం తయారు చేసుకుని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)