237 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

Telugu Lo Computer
0


దుబాయ్‌లో జరుగుతున్నఆసియా కప్‌ అండర్‌-19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత  బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు యువ క్రికెటర్‌ ఆరాధ్య యాదవ్‌ అర్ధ సెంచరీ చేశాడు. అతడితో పాటు ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌(46) రాణించడంతో భారత్‌ 237 పరుగులు చేయగలిగింది. కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ సహా మిడిలార్డర్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. 49 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశి, షేక్‌ రషీద్‌, యశ్‌ ధుల్‌, నిషాంత్‌ సింధు, విక్కీ, రవికుమార్‌ వరుసగా 0, 6,0,8, 6, 1 పరుగులు చేశారు. ఇక హర్నూర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆరాధ్య చెప్పుకోదగ్గర స్కోర్లు చేశారు. వీరికి తోడు రాజ్‌ బవా (25 పరుగులు), కుశాల్‌ తంబే (32 పరుగులు), రాజవర్ధన్‌ (33 పరుగులు) చేయడంతో భారత్‌ 200 మార్కు దాటగలిగింది. పాక్‌ బౌలర్లలో జీషన్‌ జమీర్‌కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కాయి. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)