తమ దాకా వస్తే గాని తత్వం బోధపడదు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 26 December 2021

తమ దాకా వస్తే గాని తత్వం బోధపడదు!


ఏదైనా తమ దాకా వస్తే గానీ తత్వం బోధపడదు అంటారు. అలానే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని పెద్దల పరిస్థితి తయారు అయ్యింది. ఏపిలో సినిమా టికెట్ ధరలపై ఇటీవల హీరో నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. నాని వ్యాఖ్యలపై ఏపిలోని మంత్రులు మంత్రులు బొత్సా సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు స్పందించి కౌంటర్ లు ఇచ్చారు. టాలీవుడ్ లో ఐక్యత లేదన్న విషయం చాలా కాలంగా వినబడుతూనే ఉంది. అదే విషయాన్ని హీరో నాని వెల్లడించారు. ఏపిలో సినిమా టికెట్ల విషయంపై తన అభిప్రాయం చెప్తే మీడియా దాన్ని పెద్దది చేసి చూపించిందనీ నాని ఆరోపించారు. కాకపోతే సమస్య అనేది నిజమని, అది వచ్చినప్పుడు అందరూ ఒకటికావాల్సిన అవసరం ఉందని హీరో నాని పేర్కొన్నారు. కానీ టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదన్నారు. తాను చెప్పిన మాటలు తప్పు అయితే తనకు ఆనందమేననీ కానీ టావీవుడ్ లో మాత్రం యూనిటీ లేదని నాని స్పష్టం చేశారు. తాను ఇండస్ట్రీలో ఎవరినీ అవమానించడానికి ఈ మాటలు అనడం లేదని అన్నారు. వకీల్ సాబ్ మువీ విడుదల సమయంలోనే ఈ సమస్య మొదలైందనీ, అప్పుడే అందరూ ఒక తాటిపైకి వచ్చి ఏపిలో టికెట్ల రేట్ల సమస్యలపై డీల్ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావని నాని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment