తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తగ్గింది. మొన్నటివరకు ఉత్తర దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో చలి బాగా పెరగగా.. తాజాగా ఆగ్నేశ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయి. ఆగ్నేయ దిశ, తూర్పు వైపు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. ఉత్తరాది గాలుల ప్రభావం తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఆంధ్రా కాశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగి సముద్రపు మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. కొండలు, లోయల వల్ల చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. గత కొన్నేళ్లలో రెండు సార్లు మాత్రమే మంచు కురిసినట్లు సమాచారం. డిసెంబర్ మొదటివారం నుంచి జనవరి నెలాఖరు వరకు చలి తీవ్రత లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులో అధికంగా ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)