అలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా ?

Telugu Lo Computer
0


ఇటీవలే విడుదలైన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో నాని, కృతి శెట్టిలకు చెందిన లిప్‌ లాక్‌ సీన్‌ ఒకటి ఉంటుంది. అయితే దీనిపైనే ఆ జర్నలిస్టు ప్రశ్న అడిగింది. దీంతో సాయిపల్లవి మధ్యలో కలగజేసుకుని జవాబు ఇచ్చిందినాని, కృతి శెట్టిల లిప్‌లాక్‌ సన్నివేశంలో ఎవరు కమ్‌ఫర్ట్‌గా ఉన్నారు ? నానినా, కృతిశెట్టినా ? అని ఆ జర్నలిస్టు అడిగింది. ఇందుకు కలగజేసుకున్న సాయిపల్లవి మాట్లాడుతూ.. అది చాలా అసౌకర్యాన్ని కలిగించే ప్రశ్న. అలాంటి సీన్లలో నటించడం అంటే హీరో హీరోయిన్లలో ఇద్దరికీ అసౌకర్యంగానే ఉంటుంది. సినిమాలో కథకు తగినట్లుగా సీన్లు ఉంటాయి. అంతమాత్రం చేత అలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా ? అని సాయి పల్లవి ఫైర్‌ అయ్యింది. ఇక సినిమాలో రొమాంటిక్‌ సీన్లు ఏమైనా ఉన్నాయా ? అని ఆ జర్నలిస్టు మళ్లీ అడిగింది. ఇందుకు సాయి పల్లవి మళ్లీ స్పందిస్తూ మీరు ఇలాంటి ప్రశ్నలే అడగాలని నిర్ణయించుకున్నారా ? మాకు అలాంటి సీన్లతో పెద్దగా పట్టింపు ఉండదు. కథకు అనుగుణంగా ఎలాంటి సీన్‌ కావాలంటే అలాంటి సీన్‌లో నటీనటుల అంగీకారం మేరకు నటిస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకు సంతోషంగా ఉందని జవాబు ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)