ఐశ్వర్య రాయ్‌ను 5 గంటల పాటు విచారించిన ఈడీ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 December 2021

ఐశ్వర్య రాయ్‌ను 5 గంటల పాటు విచారించిన ఈడీ!


ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల వ్యవహారంపై బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 5 గంటల పాటు విచారించింది. పనామా పేపర్లతో ఉన్న సంబంధంపై ప్రధానంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఫారెక్స్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఐశ్వర్యను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి విదేశాల్లో డబ్బు దాచుకున్నట్టు ఐశ్వర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో కూడా రెండు సార్లు ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు పంపినప్పటికీ ఆమె వాయిదా కోరారు. మరోసారి సమన్లు పంపడంతో ఆమె దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత 15 ఏళ్లలో విదేశాల నుంచి అందుకున్న చెల్లింపులకు సంబంధించిన రికార్డులను ఐశ్వర్య రాయ్‌ సమర్పించినట్టు సమాచారం.


No comments:

Post a Comment