అల్పపీడనంగా మారిన వాయుగుండం

Telugu Lo Computer
0



వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. జవాద్ తుపాను ఒడిశాలోని పూరీకి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, దాని ఫలితంగా ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు. జవాద్ తుఫాను అల్పపీడనంగా మారి బలహీనపడటంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే రేపటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, జవాద్ తుపాను బలహీనపడినా ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రలో సైతం మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవు. ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్టోగ్రత భారీగా పెరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లాలా వద్దా అనే విషయంపై వాతావరణ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)