కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన !

Telugu Lo Computer
0


నూతన జోన ల్ వ్యవస్థ నియమ నిబంధనల మేరకు ఉద్యోగుల విభజన ను చేపట్టాలని తెలంగాణ సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన , నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని తెలిపారు. వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని కేసిఆర్ అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలన్నారు. భార్యాభర్తల ఉద్యోగులు  ఒకే చోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతారని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని,  అలాగే యాసంగి పంట పై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వరి బదులు ఇతర పంటలు వేసు కోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)