ఒమిక్రాన్‌కు స్పుత్నిక్ V భేష్ !

Telugu Lo Computer
0


'స్పుత్నిక్ V' వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కి వ్యతిరేకంగా బాగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని బూస్టర్ డోస్‌గా తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు రష్యాలోని గమలేయా సెంటర్లో నిర్వహించిన ప్రాథమికం ప్రయోగంలో తేలింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు వ్యతిరేకంగా స్పుత్నిక్ V అధిక వైరస్ న్యూట్రలైజింగ్ చర్యను ప్రదర్శిస్తుందని కూడా ప్రయోగంలో తెలింది. వేరియంట్ తీవ్రంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశాన్ని, ఆసుపత్రిలో చేరే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుందని ఫలితం వచ్చింది. దీంతో రష్యాలోని ప్రజలు బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని జర్మనీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ వైరాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు. ఈ ప్రయోగంలో రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వందమందిని ఎంపిక చేసుకుని వారికి బూస్టర్ డోస్ గా స్పూత్నిక్ Vని ఇచ్చారు. బూస్టర్ డోస్ ఇచ్చాక వారిలో ఒమిక్రాన్ వైరస్లను న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి అయినట్టు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ను దాదాపు 71 దేశాలలో గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)