397 రూపాయలకే 300 రోజుల వ్యాలిడిటీ!

Telugu Lo Computer
0


ప్రైవేట్ ఆపరేటర్లందరూ ప్రీపెయిడ్ రీఛార్జి  ప్లాన్ రేట్లను పెంచినా, బిఎస్ఎన్ఎల్ మాత్రం పాత రేట్లనే యధావిధిగా కొనసాగిస్తూ తక్కువ ధరకే తన కస్టమర్లకు బెస్ట్ అఫర్లను అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే పడుతుంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అయితే, ఈ అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)