రైళ్లల్లో డిస్పోజబుల్ బెడ్ రోల్

Telugu Lo Computer
0

 

భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారి కోసం వెస్ట్రన్ రైల్వే వినూత్న పథకం తెరమీదకు తెచ్చింది. డిస్పోజబుల్ బెడ్ రోల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు 150 రూపాయలు చెల్లిస్తే ఈ సదుపాయం పొందవచ్చు. ఈ డిస్పోజబుల్ బెడ్ రోల్ ప్యాకేజీలో 7 రకాలుంటాయి. 1 డిస్పోజబుల్ బెడ్ షీట్, 2, డిస్పోజబుల్ బ్లాంకెట్ (గ్రే, బ్లూ కలర్‌)1 డిస్పోజబుల్ పిల్లో కవర్1, మూడు పొరల ఫేస్ మాస్క్1, డిస్పోజబుల్ హ్యాండ్ నాప్ కిన్1, హ్యాండ్ శానిటైజర్ శాచెట్ 1.  ఈ డిస్పోజబుల్ ప్యాకెట్ నవంబర్ 27 నుంచి నాలుగు రైళ్ళలో అందుబాటులోకి తెచ్చింది. వెండర్స్ రైళ్ళలో వీటిని అమ్ముతారు. ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయవచ్చు. 12951 ముంబై-ఢిల్లీ రాజధాని, 12953 ఆగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్, 12903 గోల్డెన్ టెంపుల్ మెయిల్, 12925 పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ రైళ్ళలో ఈ సేవలు అందిస్తోంది. ఈ రైళ్ళలో సేవల కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది వెస్ట్రన్ రైల్వే. ఈ రైళ్ళలో ప్రతి దానిలో ఇద్దరు వెండర్స్ వీటిని తమ దగ్గర అందుబాటులో వుంచుకుంటారు. 150 రూపాయలు చెల్లించి వీటిని వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. తమ ప్రయాణం ముగిశాక వీటిని డిస్పోజ్ చేయాల్సి వుంటుంది. ఇప్పటివరకూ రైల్వే శాఖ ఉపయోగించిన బ్లాంకెట్స్, బెడ్ షీట్స్ కరోనా నేపథ్యంలో అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయంతో ఈ విధానం అమలుచేస్తున్నారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లను పరిశీలించాక దేశవ్యాప్తంగా ప్రధాన రైళ్ళకు విస్తరించనున్నారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా అదనపు లగేజీ భారం మోయాల్సిన అవసరం వుండదు అంటున్నారు రైల్వే అధికారులు. బెడ్ షీట్ 1220 ఎంఎంX1905 ఎంఎం సైజ్ వుంటుంది. బ్లాంకెట్ 1370 ఎంఎం X1980 ఎంఎం సైజ్ వుంటుంది. ఇంతకుముందు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో యూవీ తరహా లగేజ్ శానిటేషన్ మెషీన్ ప్రారంభించినా. ఆదరణ లేకపోవడంతో వాటిని పక్కన పెట్టింది. వెస్ట్రన్ రైల్వే ప్రవేశపెట్టిన ఈ పథకానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)