కే ఆర్ విజయ

Telugu Lo Computer
0


ప్రముఖ దక్షిణాది నటీమణి శ్రీమతి కే ఆర్ విజయ నవంబర్ ౩౦న 1948 లో కేరళ రాష్ట్రం త్రిచూర్ లో దైవనాయకి అనే పేరుతో జన్మించారు. ఆమె 1963 లో కర్పగం అనే చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 1966 లో వేలాయుధం అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకున్నారు.ఆమె తమిళ మలయాళం తెలుగు కన్నడ హిందీ సుమారు 400 చిత్రాలలో నటించారు. విజయ తల్లి కల్యాణి కేరళ రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరుకు చెందిన వారు. ఈమె బాల్యం చాలా వరకు తమిళనాడులోని పళనిలో గడిచినది. ఈమె తండ్రి ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటించి పేరుతెచ్చుకోవాలని కలలుకన్నారు. విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. మద్రాసులో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించారు. విజయ కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.ఈమె కుమార్తె అనూష హీరోయిన్ గా గోల్‌మాల్ గోవిందం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ వంటి చిత్రాల్లో నటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)