ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే ఏడాదంతా నడపొచ్చట !

Telugu Lo Computer
0


సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలను చేసే నెదర్లాండ్స్‌ సంస్థ 'లైట్‌ ఇయర్‌’.. కొత్తగా 'లైట్‌ ఇయర్‌ వన్‌’ పేరుతో ఓ సోలార్‌ కారును అందుబాటులోకి తీసుకురానున్నది. దీనిని ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే ఏడాదంతా నడపవచ్చు అని ప్రకటించింది. ఈ కారు పై భాగాన్ని(రూఫ్‌ టాప్‌) సౌర పలకలతో తయారు చేశారు. ఇది సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు చార్జింగ్‌ అవుతుంది. 12 కిలోమీటర్లు వెళ్లేందుకు అవసరమైన విద్యుత్తును ఒక గంటలో ఉత్పత్తి చేస్తుంది. అంటే చార్జింగ్‌తో సంబంధం లేకుండా సౌరశక్తితోనే కారు నడుస్తుందన్నమాట. ఎప్పుడైనా దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు మాత్రమే సౌర శక్తితో పాటు, చార్జింగ్‌ చేసిన విద్యుత్తు అవసరం అవుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)