తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్ల ఖరారు

Telugu Lo Computer
0

 


తెలంగాణలోని ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్‌. రమణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై కసరత్తు చేయగా, ఇందులో నాలుగు సీట్లు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు. బీసీలు, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ పేర్లను ఖరారు చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు కూడా విడుదల అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ ఎన్నికలు అప్పుడే జరగాల్సి ఉండగా, కోవిడ్‌ కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)