సేంద్రియ పంటల చేటు..!

Telugu Lo Computer
0


శ్రీలంక నాయకత్వం తీసుకున్న హడావుడి నిర్ణయాల వలన నేడు అనవసరంగా ఆహార సంక్షోభం తలెత్తింది. ఇటీవల రసాయనిక పంటల వలన ఆరోగ్యం క్షిణిస్తున్నదని, అది కూడా కరోనా తరువాత అందరికి బాగా తెలియవచ్చింది. దీనితో అందరి దృష్టి సేంద్రియ సాగువైపు మళ్లింది. అలాంటి నిర్ణయమే శ్రీలంక ప్రభుత్వం కూడా తీసుకుంది. అయితే ప్రణాళిక బద్దంగా కాకుండా ఒక్కసారిగా ఈ విధానంలోకి రావాలని చూడటంతో పరిస్థితి జఠిలం అయ్యింది. ఇలాంటి విధానాలు అమలు చేయదలిచినప్పుడు ముందు ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఉత్పత్తి అవసరాల మేరకు చేయగలమా లాంటి విషయాలు ఆలోచించుకుని తదనుగుణంగా రైతులకు కూడా ఆయా వనరులు అందుబాటులో ఉన్నాయా లేదా అనేవి కూడా తెలుసుకొని, ఒక వేళ రైతుల వద్ద అలాంటి వ్యవస్థ లేని పక్షంలో ప్రభుత్వం అందించగలదా అనేది కూడా అంచనా వేసుకొని అమలు చేస్తే అప్పుడు అంతా సజావుగా సాగిపోయేది. కానీ ఇలాంటివి ఏవి విచారించకుండానే రైతులను పూర్తిగా సేంద్రీయంగా పండించండి, మిగిలిన రసాయనిక విధానాలు ఉన్నపళంగా రద్దు చేస్తున్నాం అంటూ ప్రభుత్వం ప్రకటిస్తే అది పెద్ద దుమారమే లేపింది. దేశంలో ఆహార కొరత వచ్చేసింది, రైతులు ఆందోళన బాట పట్టారు. ఉన్నపళంగా అందరికి ఆహారం అందించలేదని కావాల్సిన ఉత్పత్తి నిల్వలు లేవు, ఇలా పలు సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక్క చిన్న నిర్ణయం నేడు దేశాన్ని బాధిస్తుంది అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుందనే అర్ధం. సేంద్రీయంగా పండించాలి అన్నప్పుడు ముందు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలలో దానిని మొదలుపెట్టి, అది చేతికి వచ్చేసరికే కావాల్సిన వనరుల జాబితా తయారు చేసుకుని, దానిని అవసరమైన చోట్లకు చేర్చి అప్పుడు పూర్తిగా అమలులోకి తెస్తే అటు పండించే రైతు సిద్ధంగా ఉంటాడు, దానికి కావాల్సిన వనరులను సమకూర్చుకునే సమయం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అప్పుడు అంతటా సేంద్రియపంటలే పండుతాయి. ఇది సహజంగా జరగాల్సింది, కానీ నేను ప్రభుత్వంలో ఉన్నాను, చెప్పిందే శాసనం అంటూ నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది శ్రీలంక ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)