సుబ్రతా ముఖర్జీ కన్నుమూత

Telugu Lo Computer
0



పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ  మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. వారం రోజుల కిందట ఆయనకు శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. సుబ్రతా మృతి పట్ల మమతా తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సుబ్రతా మరణం వల్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమన్నారు. కాగా, మమతా మంత్రివర్గంలో కీలక మంత్రిగా పని చేసిన ఆయన పంచాయతీరాజ్‌ శాఖతో సహా పలు ఇతర శాఖల బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టి మంత్రి వరకు ఎదిగారు. 26 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సిద్ధార్థ శంకర్‌ రే నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రులలో సుబ్రతా ముఖర్జీ ఒకరు. 2000 నుంచి 2005 వరకు కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా కూడా పని చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)