7 నుంచి బ్రహ్మోత్సవాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 October 2021

7 నుంచి బ్రహ్మోత్సవాలు

 

ఆంధ్రప్రదేశ్ లోని  తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగనొహ్మన్ రెడ్డి  స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే జరుగుతాయని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా తిరుమలలోఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరంను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే పాత బర్డ్‌ హాస్పిటల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.  శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు.

No comments:

Post a Comment