పరగడుపున వీటిని అస్సలు తినవద్దు!

Telugu Lo Computer
0


కొన్ని ఆహార పదార్థాలను పరగడుపున తింటే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే వాటి ప్రభావం అప్పుడే ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాలను పరగడుపున అస్సలు తినకూడదు. వాటిని తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటోలు : టమాటోలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ పచ్చి టమాటోలను పరగడుపున తినడం మంచిది కాదు. అందులో ఉండే సోర్ యాసిడ్ కడుపులో ఉన్న గ్యాస్ట్రోఇంటెస్టినల్ యాసిడ్ తో కలిసి కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంటను పెంచుతుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

స్వీట్స్  : ఖా ళీ కడుపుతో స్వీట్లు తినకూడదు. పరగడుపున స్వీట్స్ తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రోజంతా అలసిపోయినట్లు ఉంటుంది.

 మద్యం : పరగడుపున మద్యం తాగడం మంచిది కాదు. ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల విపరీతమైన మత్తుకు దారితీస్తుంది. ఇది ప్రేగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

పాలు, అరటి : బరువు తక్కువగా ఉన్నవారు అరటిపండు, పాలు మిక్స్ చేసి తింటారు. అయితే పరగడుపున ఇలా చేయడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. మీరు ఇలా చేసేముందు ఒక్కసారి డాక్టర్ ను సంప్రదిస్తే బాగుంటుంది.

5.చిలగడదుంప : చిలగడదుంపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వీటిని పరగడుపున తినకూడదు. అది మీకు హాని కలిగిస్తుంది. ఇందులో ఉండే టానిన్, పెక్టిన్ కారణంగా గ్యాస్ట్రిక్, యాసిడ్ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది కాకుండా గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు ఏర్పడుతాయి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)