తెలంగాణలో మలబార్ గ్రూప్ భారీ పెట్టుబడి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 15 September 2021

తెలంగాణలో మలబార్ గ్రూప్ భారీ పెట్టుబడి


తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన మలబార్ గ్రూప్ రాష్ర్టంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తం రూ. 750 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్నట్టు, ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు మలబార్ గ్రూప్ తెలిపింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మలబార్ గ్రూప్ తెలిపింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని తెలిపింది. పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్‌కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పలు జిల్లాల్లో అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కోరారు. తమవైపు నుంచి అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం వైపునుంచి అందిస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment