మహిళలకు పూర్తిగా హక్కుల్లేవ్‌

Telugu Lo Computer
0


అఫ్గానిస్థాన్‌లో తమ హక్కుల కోసం పలుచోట్ల రోడ్లపైకి వచ్చి గొంతెత్తుతున్న మహిళల పట్ల తాలిబన్లు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాత్‌ ప్రావిన్స్‌లో రోడ్లపైకి వచ్చి తమ హక్కుల కోసం నినదిస్తున్న మహిళలను అడ్డుకున్నారు. వారి నుంచి పేపర్లు లాక్కొని చింపేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాలిబన్లు సహనంతో ఉండాలని.. వారిని ఓపిగ్గా ఎదుర్కోవాలంటూ అక్కడి పౌరులు కోరుతున్నారు. అలాగే, కాబుల్‌లో పలు దుకాణాలపై ఉన్న మహిళా మోడల్స్‌ పెయింటింగ్స్‌నూ తాలిబన్లు బలవంతంగా తొలగిస్తున్నారు. ఆయా దుకాణాల యజమానులను బలవంతం చేసి షాప్‌లపై ఉన్న మోడళ్ల ప్రచార పోస్టర్లపై తెల్ల సున్నం వేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో 'ఇదీ తాలిబన్‌ 2.0.. మహిళలకు పూర్తిగా హక్కులు లేవు' అంటూ పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)