భారత్ బంద్‌కు వామపక్షాల మద్దతు

Telugu Lo Computer
0

 


వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు ప్రజలంతా మద్దతు పలకాలని సీపీఎం, సీపీఐ, ఫార్వడ్ బ్లాక్‌, ఆర్ఎస్‌పీ గురువారం ఓ సంయుక్త ప్రకటనలో కోరాయి. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసి పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన పదో నెలలోకి ప్రవేశించిందని ప్రకటనలో వామపక్షాలు పేర్కొన్నాయి. ఆందోళన చేపట్టిన రైతులతో సంప్రదింపులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికీ విముఖత చూపుతోందని దుయ్యబట్టాయి. మూడు వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి కనీస మద్దతు ధర అముల చేయాలని, కార్మిక కోడ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)