నేతి మాట !

Telugu Lo Computer
0


చాల మంది -  తాము  తాము తిన్నా తినక పోయినా - వచ్చిన అతిధులకు " నెయ్యి " వడ్డిస్తారు . 

సామాన్య గృహ భోజనము , విందు భోజనము  , పండగ భోజనము - తద్దినపు భోజనము - వంటి అన్ని భోజనాలలో - నేతి వడ్డన తరువాత మాత్రమే - భోజనానికి ఉపక్రమిస్తారు .చేతిలో నేయి వేయటం - విస్తరి మీద నేయి వేయటం కూడా మనము చూస్తూనే వున్నాము . 

నేటికీ  నెయ్యి అనేది వేయకుండా భోజనం పెట్టరు .  టన్నుల టన్నుల నేయి అమ్ముడు అవటమే దీనికి సాక్ష్యము .

" నేతిని ఎందువల్ల ఒక భోజనంలో తప్పని సరి దినుసుగా - భోజన ప్రారంభ కర్తగా   లేదా భోజనము ప్రారంభించండి అన్న దానికి సూచన గా పెట్టారు ? అన్నది ఆలోచించ వలసిన విషయము 

 " అన్నము సంవృద్హిగా ( మీరు కోరినంత ) వున్నది - కోరి -  తిని ఆనందించండి " అని అతిథికి భరోసా ఇవ్వటమే - నేతి వడ్డన లోని ఉద్దేశ్యము . దీనిలో నిఘాఢత ఏమి లేదు .  చాలా సంప్రదాయాల వెనుక  ఉద్దేశ్యాలు ఎట్లా మరుగున పడినాయో - అల్లాగే దీనిలోని అసలు ఉద్దేశ్యము  కూడా  మరుగున పండింది .

నేతిని వడ్డించకుండా భోజనం పెడితే - వున్నది పంచుకొని తినుచున్నాము " అని ఉద్దేశ్యము . పందిరి భోజనాలలో ఇది చూడవచ్చు . 

ఒక నిండు విస్తరిలో  నేయి వడ్డన అంటే - అన్నము మరియూ పప్పు+కూరలు అన్నీ సంవృద్హిగా - వున్నాయని సూచన .

" నేతి " వారు అనగా :నేతి " అనేది ఇంటిపేరుగా కలవారు వున్నారు . దాని అర్ధం - వారు తమ ఇండ్లల్లో ఏ భోజన కార్యక్రమము జరిపినా -  పదార్దానికి ఏ లోటూ రానివ్వకుండా వండించి వడ్డన  .  చేసే కుంటుంబీకులు అని గుర్తు. అంటే వీరు ఫదిమందిని  భోజనానికి పిలిచి - ఇరవై మందికి వండిచే వంశజులు అన్నమాట. 

Post a Comment

0Comments

Post a Comment (0)