చిత్తరంజన్

Telugu Lo Computer
0



చిత్తరంజన్  1938 ఆగష్టు 25 న జన్మించారు .తండ్రి రంగాచారి  ఆకాశవాణిలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసేవారు. వారు సాయిబాబా భక్తులు .తల్లి పేరిందేవి సంగీత కళాకారిణి .ఆమె హార్మోనియం వీణ వయోలిన్ వాయించేవారు. వీరి సంతానంలో చిత్తరంజన్ జ్యేష్ఠులు. చిత్తరంజన్ మొదటి గురువు తల్లి. ఆమె పాడే పాటలను ఆలపిస్తూ వారి దగ్గర సంగీత శిక్షణ తీసుకున్నారు . తరువాత ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ శ్రీ పి వి సాయిబాబా  తండ్రి శ్రీ పుచ్ఛా సుబ్బారావు  దగ్గర శిక్షణ తీసుకున్నారు. పిమ్మట పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దగ్గర శిష్యరికం చేసారు .వారి కచేరీలకు వెళ్తుండేవారు . చిత్తరంజన్ 8 సంవత్సరాల వయసులో నిజాం ప్రభుత్వం లోని డెక్కన్ రేడియో లో పాటలు పాడటం ప్రారంభించారు .1971 లో ఆకాశవాణిలో చేరిన తరువాత 1997 వరకు ఎన్నో లలిత గీతాలను ఆలపించారు. పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణిలో చేరక ముందు చిత్రసీమ అనుభవం కూడా కలిగింది. సంగీత దర్శకులు మాస్టర్ వేణు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 లో కళారత్న బిరుదుతో వీరిని సత్కరించింది .డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ తో శ్రీలంక లోని ఒక యూనివర్సిటీ వారు సత్కరించారు. భగవద్గీత లోని 701  శ్లోకాలను గీతమహత్యం లోని 28 శ్లోకాలను స్వరపరిచారు. లలిత సంగీతంలో ఎంతో కృషి చేశారు. పలు గాయకులను తీర్చిదిద్దారు .చిత్తరంజన్ భార్య పేరు పద్మిని. ఈమె గేయరచయిత .వీరికి ముగ్గురు కుమార్తెలు విజయలక్ష్మి, వందన, అమృతవల్లి ఒక కుమారుడు శ్రీనివాస హరీష్ .

Post a Comment

0Comments

Post a Comment (0)