బతుకు కళలో ఆరితేరిన “గిరీశం ది గ్రేట్ “.

Telugu Lo Computer
0

 


డామిట్ కథ అడ్డం తిరిగింది….!!

*గురజాడ అప్పారావు గారి అపూర్వ సృష్టి "గిరీశం"

 ది గ్రేట్…!!

భారతదేశ పతనానికి గిరీశం చెప్పిన11కారణాలు.!

చివరకు గిరీశం చెడ్డోడిగానే మిగిలిపోయాడు..!!

బాధ్యతా రహిత ఆంధ్ర యువజనానికి ప్రతినిథి

 గిరీశం…!!

"కన్యాశుల్కం" నాటకం లోని గిరీశం గురించి కాస్తో కూస్తో తెలీని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి 

కాదు. గురజాడ వారు గిరీశాన్ని బతకనేర్చిన వాడిగా తీర్చిద్దినవైనం ఎంతో గొప్పది. “ అబధ్ధాలు చెప్పినా, మోసం చేసినా కేవలం బతకడానికి మాత్రమేసుమా"  అన్నది గిరీశం ఫిలాసఫీ.చూడగానేమోసగాడు, అబద్ధాలకోరుగా కనబడతాడు కానీ…నిజానికి గిరీశం మరీ అంతచెడ్డోడు మాత్రం కాదు. ఎంత రసికుడైనా బుచ్చమ్మ విషయంలో మాత్రం కాంప్రమైజై పోతాడు.

'విడో' అయిన బుచ్చమ్మను లేవదీసుకుపోయి పెళ్ళా డాలనుకుంటాడు.ఆరకంగా సంస్కరణ వాదిగా ఎదగాలని కాదు.నిజంగానే బుచ్చమ్మను ప్రేమిస్తాడు.ఇష్టపడతాడు. బుచ్చమ్మను పెళ్ళాడి ,ఆనాలుగు రాళ్ళు ఏదో ఒక విధంగా సంపాదించి ,పిల్లల్ని కని జీవితంలో “ సెటిల్" అయిపోదామనుకుంటాడు.అన్నీ….. మనమనుకున్నట్టే జరగవు కదా….!

“డామిట్ ! కథ అడ్డం తిరిగింది.", గిరీశం చెడ్డోడుగానే మిగిలిపోయాడు. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే ...... విడో మ్యారేజీ చేసుకొని ఆరోజుల్లో గొప్ప సంస్కరణవాదిగా మిగిలిపోయే వాడే.!

ఎవరీ గిరీశం..?

గిరీశం చెప్పినదాన్నిబట్టి అతని పుట్టిల్లు రాజమహేంద్రవరం. నిజానికతనికి ఓ ఊరంటూ లేదు. అన్ని  ఊళ్ళూ తనవే. ఆ మాటకొస్తే లోకమే ఇతని ఊరు. సత్రమే భోజనశాల.మఠమే నిద్రా మందిరం.పూనా డక్కన్ కాలేజీలో చదివానంటాడు కానీ..అసలు కాలేజీ గుమ్మమైనా ఎక్కివుంటాడా ! అన్నది అనుమానమే.ఇక వృత్తి ..బడిపిల్లలకు ట్యూషను చెప్పి నాలుక్కాసులు(కాపర్లు ) సంపాయించుకోవడం.

నిజానికి ట్యూషన్లయినా సరిగా చెబుతాడా అంటే అతనిశిష్యుడు వెంకటేశం చెప్పిన మాటల్ని బట్టి చూస్తే అదీ ...అనుమానమే.!!

“మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కడే.పాఠం చెప్పమంటే  యెప్పుడూ కబుర్లు‌  చెప్పడవే కానీ ఒక మారయినా ఒక  ముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ…”!! ..దటీజ్ గిరీశం .వెంకటేశం లాంటి అర్భకుడికే కాదు ,మధురవాణి లాంటి గడసర్లకు కూడా ఇంగ్లీషు పాఠాలు చెప్పాడు గిరీశానికి అక్కర్లేని (నేస్టీ) అలవాట్లు చాలానే వున్నాయి.సిగర్స్,మిఠాయి,దుస్తులు ..ఇంకా..ఇంకా ఎన్నో అక్కర్లున్నాయి.తన అక్కర్లు తీర్చుకోడానికేమైనా చేస్తాడు.నాలుగు మెతుకులు కోసం పూటకూళ్ళమ్మ ఇంట్లో నాలుగు  మెతుకుల కోసం “అరవ చాకిరీ" చేయడానికైనా వెను కాడలేదు.ఆమెకు సామాన్లు కొనిపెట్టాడు.(ఆమె డబ్బులతోనే ) ఊరకే కాదులెండికమీషన్ల కోసంం.బురిడీ కొట్టడం,గోతాలు కోయడం జీవనావసరం. అబద్ధం ఆయుధం. హస్తలాఘవం‌ కూసువిద్య.వంచన,నయవంచన,జీవనాధారం.ఇతరులు చెప్పిందల్లా బాగుందనడం అతనికి మాత్రమే తెలిసిన లౌక్యం.' ఎప్పటికెయ్యది ప్రస్తుతమో…. అప్పటికయ్యది మాటలాడి తాను నొవ్వక,ఇతరులను నొప్పించక ' తిరిగే మనస్తత్వం అలవర్చుకొని బతికిపోయాడు.తనకు తానుగా “ఈ సొగసైన ముఖం.యీ తామర రేకులవంటి నేత్రాలు,  యీ సోగ మీసాలు”అంటూ అభివర్ణించుకున్నాడు. ఇంత సొగసరి కాబట్టే పూటకూళ్ళమ్మ  గిరీశాన్ని వుంచుకుంది. సరే ..గిరీశం కూడా మధురవాణిని వుంచుకున్నాడు అది వేరే సంగతి.అంతేనా? గిరీశం‌  వెంకు పంతులు కోడలికి లవ్ లెటర్ రాశాడు.ఇక బుచ్చమ్మను హార్ట్ ఫుల్ తో ప్రేమించిన సంగతి తెలిసిందే.

*గిరీశం కవి కూడాను…!!

గిరీశానికి తెలియని విద్యలేముంటాయి చెప్పండి. చివరకు పొయిట్రీ కూడా చెప్పేయగల దిట్ట.అయితే గిరీశం చదువుకొని సంపాదించిన పాండిత్యం కాదు సుమా..! ఆంతా శ్రుత పాండిత్యం! తెలుగు కవిత్వం అట్టే ఛందస్సు అసలే రాదు. తెలిసిన దాఖలాలు లేవు .కాకపోతే చాటువుల్ని మాత్రం సందర్భానుసారం వల్లెవేస్తుంటాడు.అయితేనేం? గిరీశం తక్కువ వాడు కాదండోయ్!కాళిదాసంతటి వాడి కవిత్వానికే వంకపెట్టగల దిట్ట.జాగ్రఫీ దృష్ట్యా చూస్తే...కుమారసంభవంలోని‌ కాళిదాసు పర్వత  వర్ణనలు సరికాదన్నాడు.తనకు ఉపనిషత్తులు తెలీకున్నా..స్వయంగా తానే ఓ ఉపనిషత్కర్త గా అవతారమెత్తి..”టుబాకోపనిషత్తు “ను ప్రవచించాడు.పొగ తాగితేనే దొరలు అంతటి వారయ్యారంటూ పొగాకు కితాబిచ్చాడు.అసలు పొగను బట్టే ఆవిరి ఓడలూ,బళ్ళూ  తయారయ్యాయట.మన వేదాల్లో అన్నీ ఉన్నాయిష..అవి పట్టుకుపోయే పాశ్చాత్యులు బాగుపడ్డారు.అయితే గిరీశం మాత్రం తన్ను తాను ఇంగ్లిషోడిగా చెప్పుకోడానికే ఇష్టపడతాడు.ఇంగ్లీషు పుస్తకంలోని “బారోస్ రీడర్లో….“మై మదర్ అనే పద్యానికి అనుసరణగా ది ‘విడో ‘ అల్లేశాడు.పద్యంఅల్లిక అలా ఇలా లేదండోయ్.! టెన్నిసన్ పద్ధతిలో టెన్నిసన్ ను తలదన్నేలా రాశానని గిరీశమే చెప్పుకున్నాడు!టెన్నిసన్ కావ్యాల్లోని “అంత్యప్రాసా విన్యాసాన్ని “ గిరీశం దాదాపు దించేశాడు.గిరీశం లో ఎన్ని అవలక్షణాలున్నా..అవన్నీ ఓ ఎత్తు...అతని మేధా సంపత్తి మరో ఎత్తు…..! “The eleven causes for the degeneration of India ,” అన్న గిరీశంమాట ఓ ఎత్తు.భారత దేశం పతనానికి పదకొండు కారణాలున్నాయన్న గిరీశం మాటలు సర్ కట్టమంచి రామలింగారెడ్డి వంటి మేధావుల్ని కూడా  ఆలోచనలో పడేశాయి.నిజానికి ఈ పదకొండుకారణాలు ఏమై వుంటాయి? అని మేధావుల్లో  మేథో మథనం ప్రారంభమైందంటే గిరీశం ఎంతటి వాడో ఊహించుకోవచ్చు.

భారతదేశం పతనానికి “గిరీశం “ చెప్పిన ‘ పదకొండు కారణాలు ‘ ..!!

కళాప్రపూర్ణ బళ్ళారి టి.రాఘవ గారి సుదీర్ఘ ఉపన్యాసం….!! గురజాడ వారు ఏ ముహూర్తాన కన్యాశుల్కం నాటకం రాశారో గానీ...నాటికీ నేటికీఅదో దృశ్య కావ్యంగా మిగిలిపోయింది.ఆ నాటకంలోని మొదటి రంగంలో 'గిరీశం ‘ఇలా అంటాడు.

“డామిట్...ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది. పూనా డెక్కన్ కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు ..”ది ఇలెవన్ కాజెస్ ఫర్ ది డి జనరేషన్  ఆఫ్ ఇండియా “(The eleven causes for the degeneration of India ) ను గూర్చి మూడు గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు!మొన్న బెంగాళీవాడు ఈ  వూర్లో ..లెక్చర్ ఇచ్చినపుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ ? మనవాళ్ళు వుట్టి వెధవాయ్ లోయ్ “

ఇలా గిరీశం భారతదేశం పతనానికి పదకొండు కారణాలున్నాయని ఓ స్టేట్ మెంట్ అయితే ఇచ్చాడు కానీ..!నాటకంలో ఎక్కడా అవేమిటో చెప్పలేదు.వాటిని మీరే ఆలోచించుకోండని  పాఠకుల మీదే వదిలేశాడు.ఆ రోజుల్లో గిరీశం స్టేట్ మెంట్ లోని పదకొండు కారణాల్ని గురించి ఎవరూ  అంతగా పట్టించుకోలేదు కానీ…సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు మాత్రం తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టారు.మామూలుగా అయితే గిరీశం లాంటి భ్రష్టుడి నోట వచ్చిన ఈ మాటలకు అంతగా ప్రాథాన్య మీయాల్సిన పనిలేదు. కానీ ఇది గురజాడ వారి నాటకం కాబట్టిబుర్రకు పని పెట్టక తప్పింది కాదు.

సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారుఆరోజుల్లో (1933) ఆంధ్ర విశ్వకళాపరిషత్ విసి గా వున్నారు!

ఆంధ్రావిశ్వ కళాపరిషత్ దేశంలోని అన్ని యూనివర్సిటీల కంటే వున్నతంగా తీర్చిదిద్దాలని ఆయన వివిధ విజ్ఞాన శాఖలకు సంబంధించిన అంశాలపై ‌నిష్ణాతులచే ఎక్స్ టెనన్షన్ లెక్చరర్స్.ఇప్పించే వారు. ఇందులో భాగంగానే “ భారతదేశం పతనానికి పదకొండు కారణాలు “ అనే అంశంపై రాజమహేంద్రి ట్రెయినింగ్ కాలేజీలో ఉపన్యాసం ఏర్పాటు చేయించారు. అయితే ఎవరిచేత ఈ ఉపన్యాసం ఇప్పించాలన్న విషయమై తర్జనభర్జన జరిగాక, చివరకు... బళ్ళారి రాఘవ ' గారి  పేరును  ప్రతిపాదించారు. రాఘవ గారు ' షేక్స్పియర్,' ' బెర్నార్డ్ షా'  తదితర నాటకాల్ని అథ్యయనం చేశారు.ఆంగ్ల సాహిత్యంపై రాఘవ గారికి గట్టిపట్టుంది.అదీగాక ఆయనజాతీయ న్యాయశాస్త్రాల్లో నిష్ణాతులు.గొప్ప వక్త.ఇంకేముంది. 

ప్రసంగించాల్సిన రోజు రానే వచ్చింది.గిరీశంసూత్రీకర

ణపై విరామం లేకుండా ఆరు గంటలపాటుసుదీర్ఘం

గా ఆంగ్లంలో ఉపన్యసించారు.దురదృష్టమేమంటే అసమర్థ పాలకుల వల్ల‌ రాఘవగారి  ప్రసంగం‌ వెలు

గులోకి రాకుండా చీకట్లోకి నెట్టివేయబడింది.కాలం దొర్లిపోయింది.జనమంచి కామేశ్వరరావు గారి దృష్టి ఈ ప్రసంగపాఠంపై పడింది.యూనివర్సిటీ ముద్రణ

లన్నీ తిరగేశారు.ఎక్కడా దాఖలాలు దొరకలేదు.

చివరకు పాతకాగితాల కట్టల్లో 1935,ఆగస్టు 19వ తేదీ నాటి 'హిందూ ' పత్రికలో నాటి రాఘవగారి ప్రసంగం కనబడింది. తీగ దొరికింది .ఇక డొంకను కదిల్చారు.‌ట్రెయినింగ్ కాలేజ్లో అదే సంవత్సరం ప్రచురించిన గెజిట్దొరికింది..నెం..1779.ఎడ్యు

కేషన్31ఆగస్టు వారి మానస పుత్రుడిగా అభివర్ణిం

చారు.రాఘవ గారి దృష్టిలోగిరీశం చుట్టకాలు‌స్తూ తిరిగే పోరంబోకు కాదు.చేతి బెత్తం తిప్పుకుంటూ క్షణానికో రంగూ,స్వభావంతోతుంటరి సాహసాలు ప్రదర్శించే దుష్ట చింతన గల వాడు అంతకంటే కాదు.బాధ్యతారహిత ఆంధ్ర యువజన హృదయా

నికి గిరీశం ప్రతినిథి.

భారతదేశ పతనానికి అతను పేర్కొన్నానని చెప్పిన కారణాలు కాల్పనికం ఎంత మాత్రం కాదంటారు

బళ్ళారి రాఘవ. గిరీశం చెప్పిన పదకొండుకారణా

లూభారతదేశ పతనానికి మౌలిక కారణాలు, బాధా

కర వాస్తవాలేనన్నది  రాఘవగారి నిశ్చితాభిప్రాయం.

“మనమంతా గిరీశాన్ని ప్రేమిస్తాం.బహుశా అతని బలహీనతలే మనకు ఆకర్షణలేమో ? “అంటారు రాఘవ.

“ పూనా కాలేజీలో తాను లెక్చరిచ్చినట్లు గిరీశం చెప్పుకున్నాడు.వెంటనే మన మనస్సున ఒక సంచలనాత్మక తరంగం తీవ్రంగా తాకుతుంది.

మహనీయుడు' లోకమాన్య బాలగంగాధర తిలక్ ‘ ఉద్యమించిన పవిత్ర స్మృతులు మన హృదయా

లలో చెలరేగుతాయి.ఆ మానసిక స్థితిలో గిరీశం బహుశా భారతదేశ పతనానికి‌ పదకొండు కారణాలు 

నిరూపిస్తూ ఉపన్యాసం చేశాడేమో అన్న విశ్వాసం మనకు కలుగుతుంది .గిరీశం వివరించిన  పదకొండు కారణాలూ దైనందిన జీవితంలో సామాన్యులందరికీ ద్యోతకమయ్యే కల్పనా సత్యాలే. వాటి వల్లనే సమాజం పతనం కావడం సత్యమేనని వారంతా భావించి వుంటారు.సామాజిక జీవితంలో ఆ వినాశం స్పష్టమయ్యే రీతిలో గిరీశం విశ్వసనీయంగాచెప్పివుంటాడనే  మనం భావిద్దాం” అంటారు రాఘవ.

Post a Comment

0Comments

Post a Comment (0)