మళ్లీ విజృంభిస్తున్న కరోనా

Telugu Lo Computer
0


చాపకింద నీరులా కరోనా మళ్లీ విజృంభిస్తూ కలవర పెడుతోంది. పది రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు 10 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందని హెచ్చరించింది. 10 రాష్ట్రాల్లో 46 జిల్లాలో 10 శాతానికిపైగా, 53 జిల్లాలో 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేట్ నమోదవుతున్నట్లు తెలిపింది. అయితే రాష్ట్రాల అలసత్వ కారణంగా గత వారం రోజులుగా రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. కంట్రోల్ చేయకపోతే బీభత్సం తప్పదని వార్నింగ్ ఇచ్చింది. మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు కఠిన నిబంధనలు విధించాలని కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది. కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిస్థితిపై కేంద్రం సమీక్ష జరిపింది. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో పాజిటివిటి రేటు పది శాతం ఉందని గుర్తించింది. జిల్లా స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్రాలు స్థానికంగా జీరో సర్వే నిర్వహించాలన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)